అభివృద్ధి పనుల పరిశీలన
నిజామాబాద్ రూరల్: నగరంలోని రెండో డివిజన్ బోర్గాం (కె) గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆదివారం కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పరిశీలించారు. సూపర్‌వైజర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులతో మాట్లాడి పనులు వేగవంతం చేసుకోవాలని సూచించారు. అంబేడ్కర్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వారి కమిటీ హాల్‌ని సందర్శించారు. అనంతరం డివిజన్ గ్రామ కాంగ్రెస్ సభ్యులు బొబ్బిలి రామకృష్ణని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బోర్గాం(కె) అధ్యక్షులు రాజు, మట్ట రాము, నగేష్, నవీన్ గౌడ్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని 60వ డివిజన్ నాయకులు అలీ ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్యశిబిరాన్ని ఆదివారం నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ శిబిరాన్ని పరిశీలించి డాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా బొబ్బిలి రామకృష్ణ వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు అబుద్ బిన్ హందాన్, షాదాబ్, అంజద్, అష్రాఫ్, స్థానిక పెద్దమనుషులు, ఇతరులు పాల్గొన్నారు.


