సమస్య వస్తే పోలీసులను సంప్రదించాలి
● డిచ్‌పల్లి సీఐ వినోద్
● నూతనంగా ఎన్నికై న సర్పంచులకు అవగాహన
డిచ్‌పల్లి : గ్రామంలో ఏదైనా సమస్య వస్తే సొంత నిర్ణయాలతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిచ్‌పల్లి సీఐ కే వినోద్ సూచించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులకు ఆదివారం పోలీస్‌స్టేషన్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. నేరాల కట్టడికి శాంతిభద్రతల రక్షణ కోసం గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, రోడ్డు ప్రమాదాలను అరికట్టేలా సహకరించాలన్నారు. వానదారులందరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు. గ్రామాల్లోని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా సర్పంచులు కృషి చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శాంతిభద్రత పరిరక్షణలో పోలీసులకు సర్పంచులు పంచాయతీ పాలకవర్గాల సభ్యులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సై మహమ్మద్ ఆరిఫ్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


