పద్మశాలి సంఘ అభివృద్ధికి కృషి చేస్తా
సర్పంచ్ సాయిచరణ్‌ను సన్మానిస్తున్న
గోసంగి సంఘం సభ్యులు
భూమికను సన్మానిస్తున్న పద్మశాలి సంఘ సభ్యులు
జక్రాన్‌పల్లి: పద్మశాలి సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని గ్రామ ఉపసర్పంచ్ గాండ్ల భూమిక శేఖర్ అన్నారు. ఆదివారం జక్రాన్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ్‌పల్లిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ భూమిక శేఖర్ దంపతులు, వార్డు సభ్యుడు మానేటి శ్రీకాంత్‌కు పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పద్మశాలిలు రాజకీయంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘ పెద్దలు గాండ్ల శ్రీనివాస్, రుద్ర రాజేశ్వర్, రాజేందర్, గంగాధర్, రాంచందర్, నర్సయ్య, చరణ్, రాజేందర్, హన్మండ్లు, పంచాక్షరి, వంకర్, నాందేవ్, రాజేశ్వర్, మమత సంఘ సభ్యులు పాల్గొన్నారు.
సర్పంచ్ సాయిచరణ్‌కు సన్మానం
సిరికొండ: సిరికొండ సర్పంచ్‌గా ఎన్నికై న గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల సాయిచరణ్‌ను మండలకేంద్రంలో ఆ సంఘం నాయకులు, పలువురు సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు నిషాని రవీందర్, కార్యదర్శి శ్రీనివాస్, దేవయ్య, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి సంఘ అభివృద్ధికి కృషి చేస్తా


