ఆయకట్టుకు సాగునీరు విడుదల
మోపాల్: మండలంలోని కంజర్ పెద్ద చెరువు నుంచి పాటి మీద తూము ద్వారా ఆయకట్టు రైతాంగానికి యాసంగి సాగుకు ఎస్‌ఐ జాడె సుస్మిత ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయొద్దని, అవసరం మేరకే వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్యారం రాకేష్ యాదవ్, ఉపసర్పంచ్ గుడి ప్రవీణ్‌రెడ్డి, జీపీఓ దేవయ్య, రైతులు అరికెల నారాయణరెడ్డి, విశ్వనాథం, బున్నె రాములు, గొల్ల రాములు, గంగబాపు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.


