అల్లాడుతున్న ఆయకట్టు రైతులు
మోర్తాడ్: మండలంలోని గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గతంలోనే గండి ఏర్పడింది. దీంతో నీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కాలువను నమ్ముకుని ఏడు గ్రామాల రైతులు సుమారు 2,600 ఎకరాల్లో వివిధ రకాలైన పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరద కాలువలో నీరు లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. గాండ్లపేట్ వద్ద ఏర్పడిన గండితో ఎస్సారెస్పీ నుంచి విడుదలయ్యే నీటిని నిలిపివేశారు. గండి ఏర్పడిన ప్రాంతాన్ని మినహాయించి ముందు భాగంలో రైతులు తాత్కాలిక మట్టి కట్టను నిర్మించుకున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని వరద కాలువలోకి విడుదల చేస్తే గాండ్లపేట్ గండికి కొంత దూరంలో నీటిని నిలిపి పంటలకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చని రైతు లు భావిస్తున్నారు. మోర్తాడ్, గాండ్లపేట్, పాలెం, తిమ్మాపూర్, కమ్మర్‌పల్లి, ఉప్లూర్, నాగాపూర్ గ్రామాల రైతులను రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
మరమ్మతులకు నిధులు..
గాండ్లపేట్ వద్ద గండికి మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.8.52 కోట్లు విడుదల చేసింది. కానీ టెండర్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో పనుల ప్రారంభంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతుల విషయంలో జాప్యం జరిగినా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేస్తే వరద కాలువ ఆయకట్టుకు జీవం పోసినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆందోళన బాటలో రైతులు..
వరద కాలువకు ఇరువైపులా ఉన్న మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాలైన ఏడు గ్రామాల ఆయకట్టు రైతు లు వరి, జొన్న, సజ్జ, నువ్వులు తదితర రకాల పంటలను సాగు చేస్తారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వ రి, సజ్జ పంట వేస్తారు. దీనికి నీరు అధికంగా అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ నెల 15వ తేదీ వర కు పంటలకు సాగునీటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత పంటలకు నీరు విషయమై, చేపట్టే అంశాలపై ఈ ఏడు గ్రామాల రైతులు ఆదివారం మోర్తాడ్‌లో సమావేశమయ్యారు. ప్రభుత్వం తొందరగా రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేస్తే యాసంగి పంటలను పూర్తిగా గట్టెక్కించవచ్చని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన బాట తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు.
గాండ్లపేట్ వరద కాలువ గండికి
మరమ్మతులు కరువు
రివర్స్ పంపింగ్ ద్వారానైనా నీటిని విడుదల చేయాలని మోర్తాడ్,
కమ్మర్‌పల్లి మండలాల రైతుల విజ్ఞప్తి
అల్లాడుతున్న ఆయకట్టు రైతులు


