యువత క్రీడలపై ఆసక్తి చూపాలి
డిచ్‌పల్లి: యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని డిచ్‌పల్లి సీఐ వినోద్ సూచించారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియర్ ఖోఖో టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి హాజరైన సీఐ మాట్లాడుతూ..గ్రామ యువకులు, సర్పంచ్ గొట్టిపాటి వాసు బాబు, ఉప సర్పంచ్ సల్మాన్ ఉ మ్మడి జిల్లా ఖోఖో టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. అనంతరం విజేతగా నిలిచిన ఉప్పల్‌వాయి, ధర్మారం(బి), మద్నూర్ జట్లకు బహుమలు అందజేశారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ, ఫిజికల్ డైరెక్టర్ రాము, కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ గంగాధర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజ్‌కుమార్, నర్సింలు, సాయిబాబు, శ్రీనివాస్, గ్రామ పెద్దలు చాకటి మురళి, సొసైటీ మాజీ చైర్మన్ కే రామకృష్ణ, సింగు ప్రవీణ్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.


