కానిస్టేబుల్‌పై కేసు నమోదు
సిరికొండ: సిరికొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుధాకర్‌పై యాక్సిడెంట్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై జే రామకృష్ణ ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గంగాధర్ అనే వ్యక్తిని గత నెల 27న సుధాకర్ కారుతో ఢీకొట్టి గాయపర్చారని పేర్కొన్నారు. సంఘటన జరిగిన రోజున పెద్ద మనుషుల సమక్షంలో గాయపడిన వ్యక్తికి ఆస్పత్రిలో అయ్యే వైద్య ఖర్చులను భరిస్తానని కానిస్టేబుల్ సుధాకర్ ఒప్పుకొని వెనుదిరిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
● దాబాపై నుంచి
పడి విద్యార్థికి గాయాలు
నవీపేట్: మండల కేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన విద్యార్థి లోకేశ్ గాలిపటం ఎగుర వేస్తూ దాబాపై నుంచి కిందపడ్డాడు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న లోకేశ్ స్నేహితులతో కలిసి గాలిపటం ఎగురవేస్తూ వెనుకకు వెళ్లగా కిందపడ్డాడు. స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.


