జేసీఐ ఇందూరు అధ్యక్షుడిగా జైపాల్ కాలే
సుభాష్‌నగర్: జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్(జేసీఐ) ఇందూర్ 26వ అధ్యక్షుడిగా జైపా ల్ కాలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం నగరంలో నిర్వహించిన జేసీఐ సమావేశంలో జైపాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి, పూర్వాధ్యక్షుడు కే మనోజ్ కుమార్ చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికై న జైపాల్ 2025లో జేసీఐ ఇందూర్ కార్యదర్శిగా సేవలందించారని తెలిపారు. అదేవిధంగా జేసీఐ కార్యదర్శిగా తిరునగరి తేజస్విని ఎన్నికయ్యారని మనోజ్ పేర్కొన్నారు. జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో విసృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అధ్యక్షుడు జైపాల్ అన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న జేసీఐ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్‌అర్బన్: జిల్లా జైలులో ఖైదీలకు గంజాయి సరఫరా, ఖైదీల మధ్య గొడవపై జైళ్ల శాఖ డీ ఐజీ మురళిబాబు, ఐజీ సంపత్ విచారణ చేపట్టా రు.శనివారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వ రకు అధికారులు ఘటన వివరాలు తెలుసుకున్నా రు.ఇద్దరు జైలు అధికారులను విచారించగా, ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఖైదీల బంధువుల నుంచి డబ్బుల వసూ లు, బహుమతులను తీసుకున్నట్లు తేలింది. దీంతో జైలు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.


