సొసైటీ గోదాముల వద్దటెంట్లు ఎందుకో..?
డొంకేశ్వర్: యూరియా పంపిణీ చేసే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), గోదాముల వద్ద టెంట్లు ఉండాలనే నిబంధన రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. యూరియా పంపిణీ పూర్తయ్యే వరకు టెంట్లను ఉంచేలా చూడాలని అధికారులకు సూచించింది. జిల్లాలో 89 సొసైటీలు ఉండగా వీటి పరిధిలో ఊరూరికి గోదాములు ఉన్నాయి. వీటి ద్వారానే రైతులకు యూరియా బస్తాలను అందిస్తున్నారు. అయితే గోదాముల ఎదుట టెంట్లు ఎందుకనే ప్రశ్న అందరిలో వ్యక్తమవుతోంది. అందులో ఎండలు ఉన్నాయనేందుకు ఇది వేసవి కాలం కూడా కాదు. ప్రస్తుతం చలికి వణికిపోతు ఎండను కోరుకుంటున్న సమయంలో ప్రభుత్వం టెంట్లు వేయించి డబ్బులు ఖర్చు చేయడంపై సొసైటీ నిర్వాహకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


