తెలంగాణ బాలికల జట్టు కోచ్‌గా సుమలత
నందిపేట్: జాతీయ స్థాయి ఖేలో ఇండియా పోటీలకు నందిపేట మండల కేంద్రంలోని గీతా కాన్వెంట్ స్కూల్ పీఈటీ మర్రిపల్లి సుమలత తెలంగాణ జట్టు బాలికల కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ క్రీడలు ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు కేంద్ర పాలిత ప్రాంతం డయ్యు డామన్ లో జరుగుతాయని గీతా కాన్వెంట్ పాఠశాల కరస్పాండెంట్ కానూరి గంగా సాగర్ తెలిపారు. తెలంగాణ జట్టు బాలికల కోచ్‌గా సుమలత ఎంపికపై తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గజ్జల రమేశ్ బాబు, వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ జనరల్ సెక్రెటరీ హనుమంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ మల్లేశ్ గౌడ్, నిజామాబాద్ క్రీడల అధికారి పవన్, గీతా కాన్వెంట్ హై స్కూల్, నందిపేట్ యాజమాన్యం సుమలతను అభినందించారు.


