నేలవాలిన విద్యుత్ స్తంభం
● తప్పిన పెను ప్రమాదం
దోమకొండ: మండల కేంద్రంలోని పలుగుగడ్డ ప్రాంతంలో గడ్డిని చదును చేయడానికి గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో ఆదివారం శుభ్రం చేస్తున్నారు. ఇదే సమయంలో విద్యుత్ స్తంభానికి సపోర్టు కోసం భూమిలో ఇనుప చువ్వకు వైరుతో ఉన్న భాగాన్ని సదరు ట్రాక్టర్ ఢీకొన్నది. దీంతో విద్యుత్ స్తంభం నేల వాలుతూ గ్రామానికి విద్యుత్ సరఫరా జరిగే ప్రధాన విద్యుత్ లైన్‌పై పడటంతో విద్యుత్ మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న గ్రామ వార్డు సభ్యులు బీసు సతీశ్, బత్తిని సిద్ధరాములు, కాలనీవాసులు ఉన్నారు. వెంటనే వారు అప్రమత్తమై దూరంగా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగలేదు. వెంటనే వారు విద్యుత్ శాఖ అధికారులకు సమచారం అందించారు. ఈ ఘటనతో మండల కేంద్రంలో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


