జిల్లా మహిళలకు రాష్ట్రస్థాయి అవార్డులు
సుభాష్‌నగర్: జిల్లాలోని కులవృత్తి విభాగంలో సేవలందిస్తున్న బగ్గలి స్వప్న రజక, వ్యాపార రంగంలో రాణిస్తున్న సు రుకుట్ల ఝాన్సీ సావిత్రీబాయి ఫూలే రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. సావిత్రీబాయి ఫూలే ఫౌండేషన్, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం సంయుక్తాధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కార్యక్ర మం నిర్వహించారు.ఆన్‌లైన్ ద్వారా వినతుల ను స్వీకరించి వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చి న వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
ఇజ్రాయిల్‌లో నూతన
సంవత్సర వేడుకలు
ఆర్మూర్: ఇజ్రాయిల్‌లో ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బానాల గంగాధర్ ఆదివారం తెలిపారు. రహమత్గాన్లోని లోనా పార్క్‌లో తెలంగాణ వాసులు వందల సంఖ్యలో హాజరై వేడుకలు నిర్వహించారు. తెలంగాణ వాసులతో పాటు గుజరాత్, కర్ణాటకకు చెందిన భారతీయులు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మంగళారం రాజు, ప్రధాన కార్యదర్శి చిన్న, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, మాజీ చైర్మన్ దేగాం లక్ష్మీనారాయణ, అసోసియేషన్ వ్యవస్థాపకులు మెరుగు మహేశ్, మచ్చర్ల ఊషన్న, యాదగిరి, అన్వేష్, నారాయణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ముసాయిదా జాబితాపై నేడు సమావేశం
సుభాష్‌నగర్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కమిషనర్ దిలీప్‌కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా, అభ్యంతరాల స్వీకరణ, సవరణలు తదితర అంశాలు ఎజెండాగా సమావేశం కొనసాగనుంది.
బోధన్: ఎడపల్లి మండలంలోని ఏఆర్‌పీ క్యాంప్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ తల్లి పులి పద్మావతి(91) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తన మరణానంతరం చూపు లేని వారికి చూపు కల్పించాలని మృతురాలి కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆమె రెండు కళ్లను దానం చేశారు. బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రి వైద్యులు నేత్రాలను సేకరించారు. అంత్యక్రియల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రాంమోహన్, నాయకులు, పలు గ్రామాల సర్పంచ్‌లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జిల్లా మహిళలకు రాష్ట్రస్థాయి అవార్డులు
జిల్లా మహిళలకు రాష్ట్రస్థాయి అవార్డులు


