ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని ఇందూరు విభాగ్ ప్రముఖ్, ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు రెంజర్ల నరేశ్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 3 నుంచి 5తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెండోరోజు ఆదివారం రెంజర్ల నరేశ్ ఆధ్వర్యంలో అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నరేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ నలుమూలల నుంచి 1,500 మంది ఏబీవీపీ కార్యకర్తలు సభలకు రాగా, జిల్లా నుంచి 150 మంది కార్యకర్తలు హాజరయ్యారని పేర్కొన్నారు. ఏబీవీపీ క్రమశిక్షణ కలిగిన దేశభక్తులను తయారు చేసే సంస్థ అని తెలిపారు. చివరిరోజు సోమవారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాజరుకానున్నారన్నారు. కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ కై రి శశిధర్, విభాగ్ సంఘటన మంత్రి హర్షవర్ధన్, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు చారి, శివ, నిఖిల్, దినేశ్, పృథ్వి, సమీర్ తదితరులు పాల్గొన్నారు.
ఇందూరు విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేశ్


