మున్నూరుకాపులు అన్నిరంగాల్లో రాణించాలి
మోపాల్: జిల్లాలోని మున్నూరుకాపులు అన్నిరంగాల్లో రాణించాలని మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. ఆదివారం నగరశివారులోని బోర్గాం(పి)లో ఉన్న కిసాన్ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని మున్నూరుకాపు సంఘాలు జిల్లా సంఘంలో కలిస్తే మరింత బలోపేతం కావచ్చని తెలిపారు. అన్ని సంఘాలకు అండగా ఉంటామని, మున్నూరుకాపు సంఘాలు బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పుప్పాల శోభ, సలహాదారులు చిట్టి సాయిరెడ్డి, బంటు దాస్, సంఘం అధ్యక్షుడు బంటు సుభాష్, ప్రధానకార్యదర్శి బంటు సుదర్శన్, నాయకులు సాయిరెడ్డి, చిట్టి కిష్టయ్య, చంద్రశేఖర్, చిట్టి మోహన్ తదితరులు పాల్గొన్నారు.


