పాత నేరస్తులపై నిరంతరం నిఘా
ఏఎస్పీ చైతన్యరెడ్డి
భిక్కనూరు: పాత కేసుల్లో నేరస్తులు, నిందితులు, అనుమానితులుగా ఉన్న వ్యక్తులపై పోలీస్ శాఖ నిరంతం నిఘాను పెడుతుందని కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. ఆదివారం భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి, జంగంపల్లి గ్రామాల్లో పాత కేసుల్లో ఉన్న నేరస్తులు, నిందితులు, అనుమానితులను విచారించారు. వారు ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలు, పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలకు, మోసాలకు పాల్పడిని వారు తమ పద్ధతిని మార్చుకోవాలని లేకుంటే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగిన వారిని గుర్తించి వారి పేర్లను అనుమానిత జాబితా నుంచి తొలగిస్తామన్నారు. సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. ఏఎస్పీ వెంట భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు.


