నూతన కార్యవర్గం ఎన్నిక
ఆర్మూర్‌టౌన్: బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఆర్మూర్ పట్టణంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గడ్డం శ్రా వణ్‌రెడ్డి, కార్యవర్గ నిర్వహణ అధ్యక్షుడిగా టి వి ద్యాసాగర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శిగా బోనగిరి శ్యా మ్, ఉపాధ్యక్షులుగా జైరాజ్‌కుమార్, కే సునీత, బి నగేశ్, జి రాజేశ్, పి నరేందర్, కోశాధికారిగా బి రాజేశ్వర్, కార్య నిర్వాహణ కార్యదర్శిగా నగేశ్, సంయుక్త కార్యదర్శులుగా సురేశ్, ఆనంద్, నిఖిత ఎన్నికయ్యారు. త్వరలో ఆర్మూర్ పట్టణంలోని ఆల్ఫోర్స్ హైస్కూల్‌లో నిర్వహించే 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బ్యాల్ బ్యాడ్మింటన్ పోటీలను వి జయవంతం చేయాలని ఈ నూతన కార్యవర్గ స భ్యులు తీర్మానించారు. పలు క్రీడా సంఘల నాయకులు తిరుపతి, రమణమూర్తి, దేవన్న, మానస గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


