తప్పుల తడక.. ముసాయిదా జాబితా
ఆర్మూర్: నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు ఆ ర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల పరిధిలో ఇటీవల అధికారులు ప్రకటించిన ముసాయిదా ఓ టర్ల జాబితాలో తప్పిదాలను గుర్తించేందుకు బీజే పీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, ఆర్మూర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మందుల బాలకృష్ణ, బీఆర్‌ఎస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ మున్సిపల్ అధికారులను కలిసి నకిలీ ఓట్ల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రాలు సమర్పించారు. ఓటరు జాబితా నుంచి మరణించిన వారి పేర్లతోపాటు డ బుల్ ఉన్న ఓట్లను తొలగించకపోవడంతో ఐదేళ్ల క్రి తం మున్సిపల్ ఎన్నికల నాటికి ఇప్పటికీ గణనీయంగా ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది. దీంతో నకి లీ ఓట్లు గెలుపును నియంత్రిస్తాయోననే భయంప్రధాన పార్టీల నాయకుల్లో నెలకొంది.
ఆర్మూర్‌లో ఇలా...
● 36వ వార్డులోని పెద్దబజార్ గోల్‌బంగ్లాలోని 3–7–39 నంబర్ ఇల్లు ఓ వర్గానిది. ఈ ఇల్లు కూలిపోయి ఉంది. ఈ ఇంటి నంబర్‌పై మరోవర్గానికి చెందిన 18 మంది ఓట్లు నమోదయ్యాయి.
● 36వ వార్డులో గరిగె అనూష, వీరభద్రి పిప్రి ఓట్లు చూపిస్తున్నాయి. కానీ వీరు చాలా సంవత్సరాల క్రితమే వలస వెళ్లిపోయి ఆర్మూర్ పట్టణానికి ఎలాంటి బంధాలు లేకుండా ఉన్నారు.
● 19వ వార్డు పరిధిలోని ఓటర్ల జాబితాలో 3, 13వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ, శాసీ్త్ర నగర్ కాలనీ, కుమ్మర్‌గల్లి, చిన్న బజార్‌లకు చెందిన సుమారు 60 మంది ఓటర్లను చేర్చారు.
● 36 వార్డులోని 3–6–6లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మందుల బాలానంద్ ఓటును 15వ వార్డు పరిధిలో చూపించారు.
పురపాలిక పేరు వార్డులు మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు
నిజామాబాద్ 60 3,44,756 1,65,916 1,78,797 43
ఆర్మూర్ 36 64,165 30,735 33,428 02
బోధన్ 38 69,810 33,881 35,929 -
భీమ్‌గల్ 12 14,189 6,687 7,502 -
ముసాయిదా జాబితా ఓటర్లు..
జాబితా సవరించాలి
ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులను సవరించకుండా, నకిలీ ఓట్లను తొ లగించకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదు. జాబితాను సవరించి వార్డుల పునర్విభజన చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. – మందుల బాలకృష్ణ,
బీజేపీ పట్టణ అధ్యక్షుడు, ఆర్మూర్
ఓటరు లిస్టులో తప్పిదాలు గుర్తించే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు
ఆర్మూర్‌లో ఓ వర్గం ఇంటి నంబర్‌పై మరోవర్గానికి చెందిన 18 మంది ఓట్లు
మరణించిన వారి పేర్లు యథాతథం
తప్పుల తడక.. ముసాయిదా జాబితా


