ఈ పాస్ యంత్రాలతోనే అమ్మకాలు జరపాలి
● డీఏవో వీరాస్వామి
వర్ని: ఈపాస్ యంత్రాల ద్వారానే యూరి యా అమ్మకాలు జరపాలని జిల్లా వ్యవసా య శాఖ అధికారి వీరాస్వామి సూచించారు. వర్ని సహకార సంఘం గోదాములో యూరియా నిలువలను ఆయన సోమవా రం పరిశీలించారు. జిల్లాలో యూరియా విక్రయాలు పారదర్శకంగా ఉండేందుకు ప్రతి గోదాములో స్టాక్ బోర్డులను రోజువారీగా అప్‌డేట్ చేస్తూ సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో సరిపడా నిల్వలు ఉంచామన్నారు. రైతులు నానో యూరియాను వాడాలని, దీంతో వాతావరణ సమతుల్యతతోపాటు ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు. డీఏవో వెంట వర్ని వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ ఉన్నారు.
కలెక్టరేట్ కంప్యూటర్ల జప్తు
● పరిహారం చెల్లించకపోవడంతో కోర్టు ఆదేశాలు
నిజామాబాద్‌అర్బన్: కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన 20 కంప్యూటర్లను జిల్లా కోర్టు శనివారం జప్తు చేసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లోని లక్ష్మీ కెనాల్ కు సంబంధించి భూమిని కోల్పోయిన బాధితులు పరిహారం కోసం కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పరిహారం అందలేదు. చివరికి బాధితులు కో ర్టును ఆశ్రయించడంతో న్యాయం చేయాల ని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయినా బాధితులకు పరిహారం అందకపోవడంతో శనివారం జిల్లా సమీకృత కార్యాలయంలోని 20 కంప్యూటర్లను జప్తు చేసింది. ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయ అధికారులు ఆలస్యంతోనే పరిహారం అందలేదని కోర్టు ఆగ్రహించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
అడవులను పరిరక్షించాలి
● సీసీఎఫ్ శర్వానంద్
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో అడవులతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సీసీఎఫ్ శర్వానంద్ అటవీ సి బ్బందికి సూచించారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన డీఎఫ్‌వో వికాస్ మీనాతో కలిసి సమావేశం నిర్వహించారు. అటవీ భూములు కబ్జాకు గురి కాకుండా ని యంత్రణ రేఖను ఏర్పాటు చేయాలన్నారు. రానున్న వేసవి దృష్ట్యా అడవుల్లో అగ్ని ప్రమాదాలు కాకుండా చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు గుంతల్లో నీరు పోయాలని ఆదేశించారు. అనంతరం జూనియర్స్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్స్ డైరీని ఆవిష్కరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అసోసి యేషన్ సభ్యులు పుష్పగుచ్ఛాల స్థానంలో పేద విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు, పెన్నులు అందజేయడంపై సీసీఎఫ్ అభినందించారు. సమావేశంలో ఎఫ్‌డీవోలు సుధాకర్, భవానీ శంకర్, ఎఫ్‌ఆర్వోలు శ్రీనివాస్, సంజయ్‌గౌడ్, రవిమోహన్ భట్, రవీందర్, గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు.


