పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించండి
● అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే
పైడి రాకేశ్‌రెడ్డి
ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఆయన జీరో అవర్‌లో మాట్లాడారు. పేదలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, అనర్హులు లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే విషయమై డ బుల్ బెడ్రూం రూం ఇళ్ల కేటాయింపులో తలెత్తిన సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ల స్థ లాలు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చే యడం హర్షనీయమని, మరికొందరు పేదలకు స్థలాలు లేక ఇళ్లు నిర్మించుకోవడం లేదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో సగం ఇళ్లు మంజూ రు చేస్తే, మిగిలిన సగం 1,800 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చే యాలని కోరారు. నిజాంసాగర్ కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు రూ.1,500 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రెండేళ్ల క్రితం కాలువల లైనింగ్ పనులకు మంజూరైన రూ.22 కోట్లు, లంబాడీ తండాల్లో నిజాంసాగర్ కాలువల ఎత్తిపోతల పథకాలకు రూ.7 కోట్లు, ఎత్తిపోతల పథకాల మోటార్ల రీప్లేస్‌మెంట్‌కు నిధులు విడుదల చేయాలన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి త్వరలో అధికారులతో రివ్యూ చేసి నిధులు మంజూరు చేస్తామని సమాధానమిచ్చారు.


