తెయూలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి
తెయూ(డిచ్ పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో శ నివారం సావిత్రీబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా యూనివర్సిటీ ఉ మెన్స్ సెల్ డైరెక్టర్ భ్రమరాంబిక ఆధ్వర్యంలో ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్లో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రొఫెసర్ కనకయ్య మాట్లాడుతూ.. భారతదేశంలోనే తొలి మహిళా ఉ పాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే అని అన్నా రు. ఆమె చేసిన సామాజిక సేవలు, మహిళల అభివృద్ధి కోసం చేసిన కృషిని కొనియాడారు. ప్రొఫెసర్ విద్యావర్ధిని, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అరతి, లా కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న రాణి, లక్ష్మణ చ క్రవర్తి, అడ్మిషన్ డైరెక్టర్ వాసం చంద్రశేఖర్, ప్రొఫె సర్ రాంబాబు, అబ్దుల్ ఖవి, మూసా ఖురేషి, సమ త, జమీల్ హైమద్, నీలిమ, సంపత్ పాల్గొన్నారు.


