ఎఫ్‌పీవోల నిర్వహణపై శిక్షణ
సుభాష్‌నగర్: నగరంలోని ఎన్‌డీసీసీబీ సమావేశపు హాల్‌లో శనివారం తెలంగాణ సహకార యూనియన్ (హైదరాబాద్) క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని సొసైటీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సభ్యులు, సిబ్బందికి ఎఫ్‌పీవోల నిర్వహణపై ప్రిన్సిపాల్ భూక్య వెంకన్న శిక్షణనిచ్చారు. ఎఫ్‌పీవో ఫౌండేషన్, లీగల్ ఫామ్స్, సుపరిపాలన, క్రెడిట్, మార్కెట్, ఫోకస్ కంపారటీ వ్ అనాలసిస్, స్కీమ్స్, స్టాట్యూటరీ, నాబార్డ్ పథకాలు, ఫండ్స్ నిర్వహణ, కోర్ పథకాలు, అకౌంటింగ్, స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్,బ్రాండింగ్, ఈ– నామ్, సాంఘిక, ఆర్థిక అంశాలు, ఆదాయ వనరులు, సుస్థిర అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, ఎఫ్‌పీవో నిర్వహించే వ్యాపార అవకాశాలను భారత్ ఫిన్ టెక్ చీఫ్ ఆఫీసర్ డాక్టర్ భూసారపు శ్రీనివాస్ వివరించారు. అలాగే ఎఫ్‌పీవో వల్ల ప్రత్యక్ష ప్రయోజనాలు, సత్వర సేవలు, విధులు, బాధ్యతలు, సభ్యులకు మానవ వనరుల ప్రగతిని తెలియజేశారు. ఎన్‌డీసీసీబీ సీఈవో నాగభూషణం వందే, సొసైటీలు, ఎఫ్‌పీఓల సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు.


