బీ జోన్‌కు ఐదు తడులు..
ఎల్లారెడ్డి: రబీ సీజన్‌లో సాగయ్యే పంటల కోసం పోచారం ప్రాజెక్టు నీటిని బీ జోన్‌కు 5 తడులు ఇవ్వాలని తీర్మానం చేసినట్లు నీటి పారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. పోచారం ప్రాజెక్టు నీటి విడుదలపై ఎంపీడీవో కార్యాలయంలో శనివారం తైబందీ సమావేశం నిర్వహించారు. రబీ సీజన్‌లో బీ జోన్‌కు నీటి విడుదలకు తీర్మానించారు. మొదటి తడి ఈనెల 9 నుంచి 23వ తేదీ వరకు, రెండో తడి ఫిబ్రవరి 3 నుంచి 14వ తేదీ వరకు, మూడో తడి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 13 వరకు, నాల్గో తడి మార్చి 24 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు, ఐదో తడి ఏప్రిల్ 18 నుంచి 27వ తేదీ నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.


