రూ.లక్షలు వెచ్చించి.. ఇసుక మేటలు తొలగించి..
ప్రభుత్వం ఆదుకోవాలి..
నష్టపరిహారం అందించాలి..
ధర్పల్లి: భారీ వరద తాకిడికి కోతకు గురైన భూముల్లో తిరిగి పంటలను సాగు చేసేందుకు రైతులు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. సుమారు ఒక ఎకరం భూమికి రూ.ఒక లక్ష నుంచి రెండు లక్షల వ్యయంతో ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తీసుకువచ్చి పొలం గట్లు పోయడం, భారీగా ఏర్పడిన గుంతలలో మట్టిని పోసి పొలం మాడులను సిద్ధం చేశారు. గత ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పంటలతో పాటు రోడ్లు, ఇళ్లకు నష్టం కలిగిన విషయం తెలిసిందే. ధర్పల్లి మండలంలో కురిసిన భారీ వర్షాలకు హోన్నాజీపేట్ అటవీ ప్రాంతంలోని ముత్యాల చెరువు తెగిపోవడంతో దాని దిగువనున్న బీరప్ప తండా, నడమితండా, హోన్నాజీపేట్, వాడి గ్రామాల పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు కోతకు గురికాగా, రాళ్లు, ఇసుక మేటలు వేశాయి. ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని ప్రకటించినా, ఇప్పటివరకు నష్టపరిహారం అందించలేదు. కొన్నిచోట్ల పొలాల్లో వేసిన ఇసుక మేటలను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించడానికి అధికారులు అంచనాలను రూపొందించినా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. చేసేదేమీ లేక కొందరు రైతులు సొంత ఖర్చులతో ట్రాక్టర్లు , జేసీబీ సాయంతో ఇసుక మేటలను తొలగించి, పొలం మడులను చదును చేసి వరి నాట్లు వేశారు. మరికొందరు అప్పులకు భయపడి మిగిలిన భూమిలోనే యాసంగి పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
వరద ప్రవాహానికి నాకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమి కోతకు గురై, ఇసుక మేటలు వేశాయి. మూడు బోరు మోటార్లు కొట్టుకపోయాయి. చేసేదేమిలేక సుమారు రూ.3 లక్షలు సొంతగా ఖర్చు చేయగా 2 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ప్రస్తుతం 2 ఎకరాల్లో వరి వేశాను. మరో 3 ఎకరాలను చదును చేయాల్సి ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి. –ధరావత్ రతన్, రైతు, బీరప్ప తండా
యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులు
గతేడాది భారీ వర్షాలకు కోతకు గురైన పొలాలు
ఇప్పటికీ ప్రభుత్వం నుంచి
అందని నష్టపరిహారం
సొంత ఖర్చులతో చదును
చేసుకున్న అన్నదాతలు
నాలుగు నెలలు గడుస్తున్న పంట నష్టపరిహారం ప్రభుత్వం అందించలేదు.భారీ వరదలకు నాకున్న 2 ఎకరాల భూమి కో తకు గురైంది.రూ.లక్షన్నర ఖ ర్చు చేసి ఒక ఎకరం భూమిని చదును చేసి, వరి పంట వేశాను. ఆర్థిక స్థోమత లేక మరో ఎకరం భూమిని అలాగే వదిలేశాను. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపరిహారంతోపాటు కోతకు గురైన భూమిను చదును చేయించాలి. –ధరావత్ గణేష్, రైతు, బీరప్ప తండా
రూ.లక్షలు వెచ్చించి.. ఇసుక మేటలు తొలగించి..
రూ.లక్షలు వెచ్చించి.. ఇసుక మేటలు తొలగించి..
రూ.లక్షలు వెచ్చించి.. ఇసుక మేటలు తొలగించి..
రూ.లక్షలు వెచ్చించి.. ఇసుక మేటలు తొలగించి..


