16 నుంచి బీఎడ్, బీపీఎడ్ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 16 నుంచి బీఎడ్, బీపీఎడ్, 1, 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్‌ను సందర్శించాలని కంట్రోలర్ సూచించారు.
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం మగ్గిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు మధు బీచ్ వాలీబాల్ తెలంగాణ జట్టుకు కోచ్‌గా నియమితులయ్యాడు. కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ డామన్‌లో ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి ఖేలో ఇండియా పోటీల్లో మధు తెలంగాణ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈసందర్భంగా మధును తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, వీఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు ఎన్వీ హన్మంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేష్ గౌడ్, నిజామాబాద్ క్రీడల అధికారి పవన్, మగ్గిడి సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్, హెచ్‌ఎం హరిత, ఉపాధ్యాయులు అభినందించారు.
డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం (బి) గ్రామంలో శనివారం నిజామాబాద్–కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ఖోఖో లీగ్ పోటీలను డిచ్‌పల్లి ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్ గొట్టిపాటి వాసు ఆధ్వర్యంలో ఖోఖో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సర్పంచ్ వాసు, ఉపసర్పంచ్ సల్మాన్, జిల్లా ఖోఖో సంఘ ప్రతినిధులు, సొసైటీ మాజీ చైర్మన్ రామకష్ణ, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మున్సిపల్ పీఠాన్ని
కై వసం చేసుకోవాలి
ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపల్ పీఠాన్ని కై వ సం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీ లం చిన్న రాజులు అన్నారు. పట్టణంలో శని వారం నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ము న్సిపల్ ఎన్నికలలో బీజేపీ 12 వార్డుల్లో గెలి చి మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని అన్నారు. నాయకులు విక్రమ్‌రెడ్డి, రవీందర్‌రావు, బాలకిషన్, దేవేందర్, రాజేశ్, నర్సింలు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
16 నుంచి బీఎడ్, బీపీఎడ్ పరీక్షలు
16 నుంచి బీఎడ్, బీపీఎడ్ పరీక్షలు


