రోడ్ల విభజన.. ట్రాఫిక్ సిగ్నల్స్
మీకు తెలుసా..
రామారెడ్డి: వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి రోడ్ల విభజన, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు అనేది చాలా కీలకం. సాధారణంగా మనకు కనిపించే రోడ్లు, సిగ్నల్ వ్యవస్థలను పలు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి కంటె ఎక్కువ రోడ్లు (జంక్షన్లు) కలిసేచోట సిగ్నల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తుంటారు.
–టి జంక్షన్: ఒక రోడ్డు వచ్చి మరో ప్రధాన రోడ్డుకు నిలువుగా కలిసినప్పుడు ఇది ఏర్పడుతుంది. ఇక్కడ మూడు వైపుల నుంచి సిగ్నల్స్ ఉంటాయి.
● వై జంక్షన్: రోడ్డు రెండుగా విడిపోయినప్పుడు లేదా రెండు రోడ్లు కలిసి ఒకటిగా మారినప్పుడు ఇది ఏర్పడుతుంది.
● చౌరస్తా : నాలుగు వైపుల నుంచి వాహనాలు వచ్చే ప్రధాన కూడలి ఇది.
● రౌండ్ అబౌట్: దీనిని ’ట్రాఫిక్ ఐలాండ్’ అని కూడా అంటారు. ఇక్కడ సిగ్నల్స్ ఉండవచ్చు లేదా కేవలం వృత్తాకార మార్గం ద్వారా వాహనాలు వెళ్లవచ్చు.
ట్రాఫిక్ సిగ్నల్స్ రకాలు..
● ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులతో వాహనాలను నియంత్రిస్తాయి.
● పాదచారుల సిగ్నల్స్: నడిచి వెళ్లేవారు రోడ్డు దాటడానికి వీలుగా ఉండే సిగ్నల్స్ (నడుస్తున్న మనిషి బొమ్మ ఉంటుంది)
● హెచ్చరిక సిగ్నల్స్: ముందు ప్రమాదం ఉందని లేదా మలుపు ఉందని హెచ్చరించే పసుపు రంగుతో మెరిసే లైట్లు ఉంటాయి.
రోడ్లు రకాలు..
● నేషనల్ హైవేస్ (ఎన్‌హెచ్): దేశంలోని ప్రధాన నగరాలను కలిపేవి.
● స్టేట్ హైవేస్ (ఎస్‌హెచ్): రాష్ట్రంలోని జిల్లాలను కలిపేవి.
● ఎక్స్‌ప్రెస్‌వేస్: అత్యంత వేగంగా వెళ్లడానికి వీలుండే పరిమిత ప్రవేశ మార్గాలు ఉన్న రోడ్లు.
● స్థానిక రోడ్లు: ఊర్ల లోపల లేదా కాలనీల మధ్య ఉండే రోడ్లు.


