మహిళ దారుణ హత్య
● పలువురిపై అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి కూతురు
● గాలింపు చేపట్టిన పోలీసులు
నందిపేట్(ఆర్మూర్): మండ లంలోని తల్వేద గ్రామ శివారులోగల వాగులో ఓ మహిళా దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం వెలుగులోకి వ చ్చింది. ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీదర్‌రెడ్డి, ఎస్సై శ్యాంరాజ్ తె లిపిన వివరాలు ఇలా.. తల్వేద గ్రామ శివారులోగల వాగులో మహిళ మృతదేహంను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించా రు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించా రు. మృతురాలిని తలపై బలమైన ఆయుధంతో కొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందగా, నీటిలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. మొద ట గుర్తుతెలియని మహిళగా భావించగా, మృతురాలి చేతిపై మేఘన అనే టాటు ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆమెను నందిపేటలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన రాగల గంగామణి(40)గా గుర్తించారు. దీంతో మృతురాలి కుటుంబీకులకు పోలీసులు సమాచారం అందించారు. తన తల్లిని నందిపేటలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన స్వరూప, లావణ్య, ప్రేమల, ప్రేమల భర్త నరేష్‌లు శుక్రవారం మధ్యా హ్నం బాసర పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్లారని మృతురాలి కూతురు మేఘ న పేర్కొంది. అక్కడ తన తల్లిని వారు నమ్మించి బలమైన ఆయుధంతో తలపై కొట్టి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి అనుమానితుల కోసం గాలింపు చేపట్టారు. వారు పరారీలో ఉన్నారని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చేపట్టినట్లు సీఐ శ్రీదర్‌రెడ్డి తెలిపారు. హత్యకు దారితీసే పరిస్థితులపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లితండా వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. తెల్గాపూర్ గ్రామ సర్పంచ్ వెల్లుట్ల మేఘన భర్త నగేష్ శనివారం బైక్‌పై మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయానికి బయలుదేరాడు. తుంకిపల్లి తండా వద్ద కోతుల గుంపు అతడికి అడ్డు రావడంతో బైక్‌పై నుంచి కిందపడ్డాడు. ఈఘటనలో తీవ్రగాయాలు కావడంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రితో అతడు చికిత్స పొందుతున్నారు.


