రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాలి
సుభాష్‌నగర్: బాల్ బ్యాడ్మింటన్ క్రీడలకు పూర్వవైభవం దిశగా జిల్లా సంఘం కృషి చేస్తుందని, ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి శ్యామ్ తెలిపారు. నగరంలోని క్రీడా మైదానంలో శనివారం ఉమ్మడి నిజామా బాద్ జిల్లా బాల్ బాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో బాలబాలికల ఎంపికలను నిర్వహించారు. రాష్ట్రస్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈనెల 9 నుంచి 11వ తేదీవరకూ ఆర్మూర్‌లోని ఆల్ఫోర్స్ హైస్కూల్‌లో జరుగుతున్నాయని, ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. తుది జట్లను ఎంపిక చేశామని శ్యామ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేష్, నరేందర్, కార్తీక్, భాగ్య శ్రీ, గీత, సీనియర్ డాకారులు ఆనంద్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.


