బాలికపై వృద్ధుడి లైంగిక దాడి
నస్రుల్లాబాద్: మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో 16ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి ప్రయత్నించాడని ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. గ్రామానికి చెందిన పాపయ్య(53) అనే వ్యక్తి ఇంటి పక్కనే బాలిక సమీప బంధువు ఇళ్లు ఉంది. దీంతో పాపయ్య కొంతకాలంగా బాలికకు మాయ మాటలు చెప్పి దగ్గరయ్యాడు. శనివారం గల్లీలో ఎవరులేని ప్రదేశానికి బాలికను తీసుకువెళ్లాడు. అనంతరం బాలికతో అతడు అసభ్యంగా ప్రవర్తించగా, ఆమె ప్రతిఘటించి, వెంటనే కుటుంబ సభ్యులకు తెలిపింది. స్థానికులు, కుటుంబీకులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రుద్రూర్: కోటగిరి మండలం రాంపూర్ శివారులో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. పోతంగల్ మండలం కొడిచర్ల శివారులో శనివారం మంజీరా నదిలో ట్రా క్టర్ ఇసుక నింపుకుని వెళుతుండగా రాంపూర్ శివారులో అదుపు తప్పి బోల్తా పడింది. ట్రాక్టర్‌ను డ్రైవ ర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో బోల్తా పడినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు.
రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్ల శివారులోని మంజీరా నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు బొలెరో వాహనాలను శనివారం పట్టుకున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు. ఈ వాహనాలను కోటగిరి పోలీస్‌స్టేషన్ తరలించి, కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఎవరైన అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణ చేసే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


