రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత– నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా రవాణ శాఖ అధికారి ఉమామహేశ్వరరావు అన్నా రు. జిల్లాకేంద్రంలోని ఐటీఐ విద్యార్థులకు శుక్రవా రం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం ఆర్టీఏ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించడంతోపాటు మరి కొంతమందికి అవగాహన కల్పించాలన్నారు.ఈనెల 31 వరకు ఈ అవగాహన కార్య క్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంవీ ఐలు కిరణ్ కుమార్, పవన్ కళ్యాణ్, వాసుకి, ఐటీఐ ప్రిన్సిపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


