ఆర్మూర్ సీఐపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు
ఆర్మూర్: ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో (సీఐ) సత్యనారాయణ గౌడ్‌పై ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన పచ్చూక రాజేశ్వర్ శుక్రవారం హైదరాబాద్‌లో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఈసందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. మచ్చర్లలో తమ భూమి వివాదంలో తనపై కొందరు గ్రామస్తులు దాడికి పాల్పడగా, వారిపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో గత నెల 2న ఫిర్యాదు చేశానన్నారు. కానీ కేసు ఫైల్ చేయని కారణంగా జిల్లా కేంద్రంలోని పోలీసు అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేశానన్నారు. దీంతో ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తనను పిలిపించి ఆర్మూర్ మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య కారును తాను కాలబెట్టినట్లు ఒప్పుకోమంటూ దాడికి పాల్పడ్డాడని ఆరోపించాడు. దళిత యువకుడినని కూడా చూడకుండా దాడికి పాల్పడిన సీఐపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘానికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు.


