తప్పిన ఘోర ప్రమాదం
● బడాపహాడ్‌లో దుకాణాల్లోకి దూసుకొచ్చిన బస్సు
వర్ని: మండలంలోని బడా పహాడ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. మ హారాష్ట్ర నుంచి ఉర్సు కోసం భక్తులను తీసుకువ చ్చిన బస్సును రివర్స్ చేస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మూడు దుకాణాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల వద్ద, రోడ్లపై యాత్రికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


