పాఠశాలల తనిఖీ
వేల్పూర్: వేల్పూర్ మండల కేంద్రంలోని ఉన్నత, ప్రాథమిక, భవిత పాఠశాలలను జిల్లా విద్యాధికారి అశోక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను చదివించి వారి అభ్యసనా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఎస్సెస్సీ విద్యార్థులకు సిలబస్ పూర్తయిందా అని అడిగారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణపై హెచ్‌ఎం రాజన్నను అడిగి తెలుసుకున్నారు. వేల్పూర్‌లో అమలు చేస్తున్న అక్షర పల్లకి కార్యక్రమం ద్వారా విద్యార్థులు తెలుగు భాషపై ఏవిధంగా పట్టు సాధిస్తున్నారో పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో రేణుక, ఉపాధ్యాయులు ఉన్నారు.
పరీక్ష ఫీజు చెల్లింపు
గడువు పొడిగింపు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఎడ్, బీపీఎడ్, 1, 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్ష ఫీజును ఈనెల 16 వరకు పొడిగించినట్లు కంట్రోలర్ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్‌ను సందర్శించాలని కంట్రోలర్ విద్యార్థులకు సూచించారు.
నిజామాబాద్ రూరల్: తెలంగాణ భాషా సాహిత్యాల పరిరక్షణకు, సృజనాత్మక రచనలను ప్రో త్సహించడానికి నిజామాబాద్‌కు చెందిన ‘హరి దా’ రచయితల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నా రు. హైదరాబాద్‌లోని త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో గురువారం రాత్రి హరిదా రచ యితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేంద ర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని, మా ట్లాడారు. హరిదా సంఘం నిర్వహించిన తెలంగాణ భాషా కవితా, కథా రచన పోటీల విజేత లకు ‘సరస్వతి రాజ్ హరిదా పురస్కారాలను‘ అందజేశారు. హరిదా ప్రతినిధులు తిరుమల శ్రీనివాస్ ఆర్య, సతీశ్ కుమార్, డాక్టర్ మామిడి సాయినాథ్ తదితరులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): చోరీ ఘటనలో లింగంపేట మండలం మాలోత్ తండాకు చెందిన ర మేశ్, బన్సీలను శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలి పారు. పర్మళ్లతండాలో శ్రీనివాస్‌కు చెందిన కి రాణం షాపులో, సజ్జన్‌పల్లి గ్రామ గేటు వద్ద రాందాస్ కృష్ణమూర్తిగౌడ్‌లకు చెందిన కిరాణ షాపులో సామగ్రిని, నగదును వారు అపహరించినట్లు పేర్కొన్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా రమేశ్, బన్సీలు చోరీకి పాల్పడినట్లు గుర్తించి, వారి వద్ద నుంచి చోరీ చేసిన సామగ్రి, నగదు ను రికవరీ చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
పాఠశాలల తనిఖీ


