జిల్లాస్థాయికి హాకీ క్రీడాకారుల ఎంపిక
ఆర్మూర్: నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా స్థాయి హాకీ క్రీడాకారుల ఎంపికలు ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించారు. ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–19 బాలుర విభాగంలో క్రీడాకారుల ప్రతిభను పరీక్షించి జిల్లాస్థాయికి ఎంపిక చేసినట్లు జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 3వ తేదీ నుంచి మూడు రోజులపాటు రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని వీఎం హోం రెసిడెన్షియల్ స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటారన్నారు. అక్కడ ప్రతిభ కనబర్చితే రాష్ట్రస్థాయికి ఎంపికవుతారని వివరించారు. ఎంపిక పోటీల్లో జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ సడక్ నగేశ్, జిల్లా హాకీ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజు, సీనియర్ హాకీ క్రీడాకారుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


