రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేపట్టాలి
ఆర్మూర్: సర్పంచ్‌లుగా గెలిచిన యువత రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడు సూచించారు. ఆర్మూర్ పట్టణం కొటార్మూర్‌లో రైతుసేవా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల సర్పంచులుగా విజయం సాఽధించిన 25 మంది రైతులను శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి ఎంతో కొంత చేయాలని సర్పంచ్‌గా పోటీ చేయడానికి గల్ఫ్ నుంచి వచ్చి విజయం సాధించిన వారికి, సర్పంచులుగా విజయం సాధించిన రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు కొల్లె నర్సయ్య, ముస్కు సాయరెడ్డి, రుక్మాజీ, ఎన్‌ఆర్‌ఐ, నరేశ్, వర్షిత, రేవతి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామీణ ప్రాంతాల రైతులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సహకార బ్యాంకు అధికారులు సూచించారు. శుక్రవారం పొల్కంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గుర్తుతెలియని వ్యక్తులు అమాయకులైన రైతులకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అపరిచిత వ్యక్తులు బ్యాంకు అధికారుల పేరిట ఫోన్ చేస్తే స్పందించవద్దని సూచించారు. అలాంటి ఫోన్లు వస్తే వెంటనే పోలీసులకు, బ్యాంకు అధికారులకు ఫోన్ చేయాలన్నారు. అనంతరం ఏఈవో రాకేష మాట్లాడారు. యాసంగిలో రైతులు సాగు చేస్తున్న పంటల సస్యరక్షణ చర్యల గురించి వివరించారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేపట్టాలి


