
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
సదాశివనగర్: భార్యను బండరాయితో హత్య చేసిన భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. సదాశివనగర్ పీఎస్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన చిందం రవి, లక్ష్మి భార్యా భర్తలు. వీరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున భార్యాభర్త మధ్య గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన రవి భార్యపై బండరాయితో మోది హత్య చేశాడు. హత్యకు ఉపయోగించిన బండరాయిని, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. హత్య కేసును చేధించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై పుష్పరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.