
ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరు..
బీబీపేట: ప్రమాదవశాత్తు బావిలో జారిపడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్ ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన పిప్పిరిశెట్టి దేవయ్య శనివారం సాయంత్రం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ మోటారు మరమ్మతుల కోసం బావిలోకి దిగే ప్రయత్నంలో జారిపడ్డాడు. అంతలోనే ఫిట్స్ రావడంతో నీటిలో ఊపిరాడక మృతి చెందాడు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఉదయం పొలంలోని బావిలో మృతదేహం కనిపించడంతో గ్రామస్తుల సహాయంతో నీటిని మోటార్ల ద్వారా తీయించారు. మృతుడి భార్య దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.