
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: క్షణికావేశంలో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం కొట్టాల్‌పల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బచ్చగారి రాజమణి(50) భర్త విఠల్ గల్ఫ్‌కు వెళ్లి వచ్చాడు. చేసిన అప్పులు తీరలేదు. దీంతో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. భార్యా భర్తల మధ్య ఆదివారం ఉదయం మరోసారి గొడవ జరిగింది. క్షణికావేశానికి గురైన రాజమణి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు.
మోపాల్: మండలంలోని మోతీరాంనాయక్ తండా వద్ద రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలైనట్లు ఎస్సై జాడె సుస్మిత ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కాల్పోల్ తండాకు చెందిన హీరాబాయి నగరంలో నివాసం ఉంటోంది. తండాలో తీజ్ వేడుకలు ఉండటంతో యాక్టివాపై వెళ్తుండగా, మోతీరాంనాయక్ తండా వద్ద బైరాపూర్ శివారులోని పోచమ్మ తండాకు చెందిన బానోత్ మంగూరామ్ వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ప్రమాదంలో హీరాబాయి కాలికి తీవ్ర గాయమైంది. క్షతగాత్రురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కామారెడ్డి క్రైం: కామారెడ్డి ముపన్సిపల్ పరిధిలోని టేక్రియాల్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఓ సబ్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. టాన్స్‌కో జిల్లా కార్యాలయంలోని టెక్నికల్ విభాగంలో పని చేస్తున్న దేవీప్రసాద్ విధుల్లో భాగంగా టేక్రియాల్ వైపు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు.
గాంధారి: మండల కేంద్రంలోని దాబా నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఓ దాబాలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా సిట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు అన్వేష్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాబాలు, హోటళ్లలో ఎవరైనా అనుమతి లేకుండా సిట్టింగ్‌లు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.
బాన్సువాడ: బీర్కూర్ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న మూడు టిప్పర్లు, పొక్లె యిన్ సీజ్ చేసినట్లు బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ ఆదివారం తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. దాడిలో మూడు టిప్పర్లను, పొక్లెయిన్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతులు లేకుండా మొరం తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య