
ప్రజావాణికి 102 ఫిర్యాదులు
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 102 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ర్యాగింగ్‌ను అరికట్టాలి
ర్యాగింగ్‌ను అరికట్టాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కరక గణేశ్ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌కు విన్నవించారు. మెడికల్ కళాశాలలో ర్యాగింగ్‌తో మెడికో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు.