
1న కలెక్టరేట్ ఎదుట నిరసన
నిజామాబాద్‌అర్బన్: సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా భావిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపడతామని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరసన అనంతరం సీపీఎస్ రద్దు కోసం రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి తరలిరావాలన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం చేపట్టనున్న బస్సు యాత్ర సెప్టెంబర్ 11న జిల్లా కేంద్రానికి వస్తుందని పేర్కొన్నారు. యా త్రను విజయవంతం చేయాలని తెలిపారు. సమావేశంలో టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జాకీ హుస్సేన్, ఆర్మూర్ యూ నిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, సూర్య ప్రకాశ్, సాయి కృష్ణ, జ్ఞానేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.