
మెగా జాబ్ డ్రైవ్‌లో 115 మందికి ఉద్యోగాలు
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాలలో మ్యాజిక్ బస్, సిస్కో ఆధ్వర్యంలో సోమవారం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 222 మంది విద్యార్థులు డ్రైవ్‌లో పాల్గొనగా, 115 మంది ఉద్యోగాలు సాధించారు. ఉమెన్స్ కళాశాలకు చెందిన 25మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. మెగా జాబ్ డ్రైవ్‌లో యాక్సిస్ బ్యాంక్, ఫిన్విచ్, టెక్ మహీంద్రా కంపెనీలతోపాటు ఇతర 14 సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ భారతి రెడ్డి, కళాశాల ట్రైనింగ్ కం ప్లేస్‌మెంట్ అధికారి ప్రసాద్, మహేశ్, ఉమెన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు రాజేందర్, కరస్పాండెంట్ కిషన్ రెడ్డి, జయంతి, సెక్రెటరీ పద్మనాభరెడ్డి, కోశాధికారి అప్పన్న తదితరులు పాల్గొన్నారు.