
పీజీలో వినూత్న కోర్సులు
● బీఆర్‌ఏవోయూ జేడీ రాజేందర్‌రెడ్డి
నిజామాబాద్‌అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ జిల్లా ప్రాంతీయ కేంద్రంలో పీజీ సైన్స్ కోర్సులతోపాటు వివిధ వినూత్న పీజీ విద్యా కార్యక్రమాలను అందిస్తున్నామని వర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్య ఉపకార వేతన ఆధారిత విద్య కార్యక్రమాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమాన విద్య అవకాశాలను అందించేందుకు సమత, నిపుణ ఫెలోషిప్‌లు అందిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ అధ్యయన కేంద్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి పీజీ సైన్స్, లైబ్రరీ సైన్స్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, ప్రాంతీయ సమన్వయ కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రంజిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.