
వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి
నవీపేట మండలం అల్జాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళను శారీరకంగా వేధించి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వెంటనే అతనిపై చర్య తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ అర్బన్ అధ్యక్షుడు సుధాకర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అల్జాపూర్ గ్రామానికి చెందిన మహిళను బెదిరించి లొంగదీసుకుని శారీరకంగా వేధించాడని, అనంతరం వీడియోలు, ఫొటోలు బయట పెడతానంటూ బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. సంతోష్‌పై నవీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. సంతోష్‌తో సదరు మహిళకు ప్రాణహాని ఉందని, వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.