డొంకేశ్వర్(ఆర్మూర్): వానాకాలం సీజన్‌లో సాగవుతున్న పంటల లెక్క తేలింది. జిల్లాలో మొత్తం 5,24,506 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఆగస్టు రెండో వారంతో వరినాట్లు పూర్తి కావడంతో పంటల సాగు విస్తీర్ణంపై అధికారులకు స్పష్ట త వచ్చింది. అయితే గతేడాది వానాకాలం సీజన్ తో పోలిస్తే ఈ ఏడాది కొన్ని పంటల సాగు విస్తీ ర్ణం తగ్గింది. వరి, పసుపు, పెసర విస్తీర్ణం మాత్ర మే కొంత మేర పెరిగింది. సోయాతోపాటు మొ క్కజొన్న, మినుము పంటల సాగును రైతులు కొంత తగ్గించారు. ఈ సీజన్‌లో వేరుశనగ సాగు అసలే లేదు. ఇప్పటి వరకు రైతులు 63 వేల మె ట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారు. మొక్కజొన్న కంకి దశకు చేరుకోగా, వరి గింజలు వచ్చే దశలో ఉన్నాయి. జిల్లాలో 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచే అవకాశముంది.
క్రాప్ బుకింగ్ ఆలస్యం
జిల్లాలో సాగవుతున్న పంటల వివరాలను ఆన్‌లైన్ చేసేందుఉ ప్రభుత్వం డిజిటల్ క్రాప్ బుకింగ్ వెబ్‌సైట్‌ను ఇంకా తెరవలేదు. దీంతో పంటల వివరాల నమోదు ఆలస్యమవుతోంది. జూన్‌లోనే ప్రారంభం కావాల్సిన క్రాప్ బుకింగ్ ఇంత వరకు చేయకపోవంతో ఏఈవోలు ఎదురుచూస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదైతేనే ప్రభుత్వం పంట దిగుబడులు కొనుగోలు చేసేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలో అంచనా వేసే అవకాశం ఉంటుంది. క్రాప్ బుకింగ్‌పై త్వరలో ఆదేశాలు వచ్చే అవకాశాలున్నాయని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ ‘సాక్షి’కి తెలిపారు.
పంటల సాగు విస్తీర్ణం (ఎకరాల్లో..)
5,24,506 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు..
గతేడాదితో పోలిస్తే జిల్లాలో
కొంతమేర పెరిగిన వరి సాగు విస్తీర్ణం
తేలిన పంటల సాగు లెక్క