పల్లె దవాఖానాలపై పట్టింపేది..? | - | Sakshi
Sakshi News home page

పల్లె దవాఖానాలపై పట్టింపేది..?

Aug 25 2025 8:55 AM | Updated on Aug 25 2025 8:55 AM

పల్లె

పల్లె దవాఖానాలపై పట్టింపేది..?

పల్లె దవాఖానాలపై పట్టింపేది..?

రావాలంటేనే భయమేస్తోంది

ఉన్నతాధికారులకు నివేదించాం

మాక్లూర్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని అన్ని రకాల వైద్య సేవలు పల్లెలకు చేరువ చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది. కానీ అందులో కనీస వసతులు లేకపోవడంతో రోగులు, విధులు నిర్వహించే వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. మాక్లూర్‌ మండలంలోని మాణిక్‌బండార్‌లో ఉన్న పల్లె దవాఖానా అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ దవాఖానాకు ఏడేళ్లుగా విద్యుత్‌ సరఫరా లేక రోగులు, వైద్య సిబ్బంది ఇక్కట్లు పడుతున్నారు. కల్లెడి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఈ పల్లె దవాఖానాను తండాతోపాటు మాణిక్‌బండార్‌ వాసులు ఉపయోగించుకుంటారు. ప్రతి నిత్యం 20 నుంచి 30 మంది గర్భిణులు, చిన్నాచితక జబ్బులతో బాధపడుతున్న వారు దవాఖానాకు వస్తుంటారు. ఇందులో నలుగురు ఆశవర్కర్లు, ఒక ఎంఎల్‌హెచ్‌పీ వైద్యురాలు సేవలందిస్తుంటారు. కానీ, దవాఖానాలో కనీస వసతులు లేకపోవడంతో రోగులు, విధులు నిర్వహించే వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ దవాఖానాకు సంబంధిత అధికారులు పలు కారణాల నేపథ్యంలో కరెంట్‌ సరఫరాను నిలిపివేసి ఏడేళ్లు కావొస్తోంది. కానీ, ప్రతి నెలా పాత బకాయితోపాటు ప్రస్తుత బిల్లు రూ.35వేలు వస్తోంది. పాత బకాయి చెల్లిస్తే కానీ విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే పరిస్థితి లేదని విద్యుత్‌ అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో చీకటి గదుల్లోనే వైద్యసేవలు కొనసాగుతున్నాయి. మరోవైపు చిన్నపాటి వర్షం కురిస్తే చాలు పల్లె దవాఖానా ఆవరణ మొత్తం మురికి కూపాన్ని తలపిస్తోంది. దీంతో దవాఖానాకు వచ్చే గర్భిణులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దవాఖానా ఆవరణలో పాములు సంచరిస్తున్నాయి. దీంతో వైద్య సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఊరి చివరిలో మురికి కాల్వల మధ్య ఉన్న పల్లె దవాఖానాకు రావాలంటేనే భయం వస్తోంది. ఇక్కడ కనీస వసతులు లేవు. కనీసం కూర్చునేందుకు కు ర్చీలు, టేబుళ్లు కూడా లేవు.

– నవనీత, గర్భిణి, మాణిక్‌బండార్‌

పల్లె దవాఖానాలో అసౌకర్యాలు, కనీస వసతులపై ఉన్నతాధికారులకు నివేదించాం. గతంలో కార్పొరేటర్‌గా ఉన్న రాయ్‌సింగ్‌ దవాఖాన బాగోగులు చూసేవారు. వారి పదవీకాలం పూర్తి కావడంతో పట్టించుకునేవారు లేరు. దీంతో దవాఖాన పరిసరాలు అపరిశభ్రంగా మారాయి. త్వరలో విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తాం.

– డాక్టర్‌ ప్రకాశ్‌, కల్లెడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

మాణిక్‌బండార్‌లో

చీకట్లోనే వైద్య సేవలు

మురికి కూపాన్ని తలపిస్తున్న

ఆస్పత్రి ఆవరణ

ఇబ్బంది పడుతున్న రోగులు,

వైద్య సిబ్బంది

పల్లె దవాఖానాలపై పట్టింపేది..?1
1/2

పల్లె దవాఖానాలపై పట్టింపేది..?

పల్లె దవాఖానాలపై పట్టింపేది..?2
2/2

పల్లె దవాఖానాలపై పట్టింపేది..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement