హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

హల్‌చల్‌

Aug 25 2025 9:21 AM | Updated on Aug 25 2025 9:21 AM

హల్‌చ

హల్‌చల్‌

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌
నార్త్‌ గ్యాంగ్‌ల

గాంధీ పేరును చోరీ చేసింది..

రాహుల్‌గాంధీ ఓట్‌ చోరీ అంటూ డ్రామాలు చేస్తున్నారని, గాంధీ పేరును చోరీ చేసింది సోనియా కుటుంబమేనని ధన్‌పాల్‌ అన్నారు.

సోమవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2025

– 8లో u

చంద్రశేఖర్‌ కాలనీలో గ్యాస్‌ కట్టర్‌తో

ధ్వంసం చేసిన ఏటీఎం (ఫైల్‌)

తెయూ ఇంజినీరింగ్‌

కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్స్‌

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ రాష్ట్ర టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌, అడ్మిషన్స్‌ కన్వీనర్‌ టీజీఎప్‌సెట్‌–2025 ఉత్తర్వుల ప్రకారం తె లంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 26, 28, 29వ తేదీల్లో అర్హులైన అభ్యర్థులకు స్పాట్‌ అడ్మిషన్స్‌ ఇవ్వనున్నా రు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), కంప్యూటర్‌ సైన్స్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ), కంప్యూటర్‌ సైన్స్‌ (డాటా సైన్స్‌) కో ర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు స్పాట్‌ అడ్మిషన్లు పొందొచ్చని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ ఆరతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత కౌన్సెలింగ్‌లో సీ ట్లు అలాట్‌ అయినవారు స్పాట్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా నిబంధనలు స్పాట్‌ అ డ్మిషన్స్‌కు వర్తించవని ప్రిన్సిపాల్‌ తెలిపారు. స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ వర్తించదన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www. telanganauniversity. ac.inను సంప్రదించాలని సూచించారు.

స్టాఫ్‌నర్సుల జాబితాలో గందరగోళం

నిజామాబాద్‌నాగారం: వైద్య, ఆరోగ్యశాఖ లో స్టాఫ్‌ నర్సుల సెలక్షన్‌ జాబితా గందరగోళంగా మారింది. 1:2 జాబితాను ఈ నెల 23న శాఖ వెబ్‌సైట్‌లో పెట్టారు. 30 పోస్టుల కు గాను 60మంది పేర్లను పెట్టారు. అయితే 60 మంది జాబితాలో 13మంది పేర్లు రెండేసి సార్లు రావడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. 30 పోస్టులకు వందలాది దరఖాస్తులు వచ్చాయి. సర్టిఫికెట్లను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఐదుగురిని ని యమించారు. అయినా జాబితాలో మాత్రం 13మంది పేర్లను రెండేసి సార్లు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 26న ఆర్డర్‌ కాపీలు ఇవ్వాల్సి ఉంది.

నేటి నుంచి యాంత్రీకరణ దరఖాస్తుల స్వీకరణ

రైతు వేదికల్లో స్వీకరించనున్న

అధికారులు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): యాంత్రీకరణ పథకం కింద రాయితీపై వ్యవసాయ పనిముట్ల కో సం రైతులు దరఖాస్తులు చేసుకోవాలని జి ల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్‌ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. రైతు వేదిక ల్లో సోమవారం నుంచి వ్యవసాయాధికారు లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నా రు. జిల్లాకు 6,742 యూనిట్లు మంజూరు కా గా మొదటి విడతగా రూ.1.67కోట్లు మంజూరయ్యాయని, మొత్తం 11రకాల వ్యవసా య పరికరాలకు సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు రైతులకు, మహిళలకు 50శాతం, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీ ఉందని పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు పట్టాపాస్‌ పుస్తకం, ఆధార్‌ జిరా క్స్‌ అందజేయాలని సూచించారు. గతంలో లబ్ధి పొందని రైతులకు ప్రాధాన్యత ఉంటుందని, లబ్ధిదారుల ఎంపిక తర్వాత పరికరాలు సరఫరా చేసే కంపెనీ పేరుపై రైతులు డీడీ తీయాల్సి ఉంటుందని తెలిపారు.

యూపీ, ఢిల్లీ, హర్యానా.. వేల కిలో మీటర్ల దూరంలోని ఆయా రాష్ట్రాల నుంచి వస్తున్న దొంగలు దడ పుట్టిస్తున్నారు. వేల కిలోమీటర్ల ప్రయాణం.. వస్తూ వస్తూ వాహనాల దొంగతనాలు.. ఆ వాహనాల్లోనే తిరుగుతూ ఏటీఎంలు, ఇళ్లను కొల్లగొడుతున్నారు. పని పూర్తి కాగానే వాహనాలను ఎక్కడో ఓ చోట వదిలేసి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చోరీలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది.

ఖలీల్‌వాడి: జిల్లాలో జరుగుతున్న వరుస దోపిడీ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని అరెస్టు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్ర దేశ్‌, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల నుంచి వచ్చి పక్కా స్కెచ్‌తో దోపిడీలకు పాల్పడుతుండగా, నేరస్తులు పట్టుబడకపోవడంతో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

మహారాష్ట్ర నుంచి చెడ్డీ గ్యాంగ్‌..

మహారాష్ట్రకు చెందిన చెడ్డీ గ్యాంగ్‌ పేరు వింటేనే హడల్‌. ఒంటిపై చొక్కా, కాళ్లకి చెప్పులు లేకుండా చెడ్డీలు ధరించి ఒంటికి నూనె రాసుకొని, చేతిలో రాడ్లు పట్టుకుని చోరీలు చేస్తుంటారు. నిజామాబాద్‌ నగరంలోని వినాయక్‌నగర్‌, ముబారక్‌నగర్‌ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఆరు సంవత్సరాల్లో ఆరు దొంగతనాలు చేయగా రెండు కేసులను పోలీసులు ఛేదించారు. ఏడాదిన్నర క్రితం నగరంలోని మూడో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చెడ్డీ గ్యాంగ్‌ కదలికలను గుర్తించారు. ఆ తరువాత గ్యాంగ్‌ మళ్లీ జిల్లాలో కనిపించలేదు.

బ్యాంక్‌లు, సెల్‌ఫోన్‌ టవర్లు..

యూపీ ముఠాల టార్గెట్‌

మూడేళ్ల క్రితం మెండోరా మండలం బుస్సాపూర్‌ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో యూపీకి చెందిన ముఠా దోపిడీకి పాల్పడింది. గ్యాస్‌కట్టర్‌తో షట్టర్‌ను తొలిగించి 8 కిలోల 300 గ్రాముల బంగా రం ఎత్తుకెళ్లింది. రూ.7.30 లక్షల నగదు కాలిపో యింది. ఇప్పటి వరకు ఈ ముఠా సభ్యుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేసి వారి నుంచి కొంత బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. జక్రాన్‌పల్లి ప్రాంతంలోని సెల్‌ టవర్‌కు సంబంధించిన విలువైన సామగ్రిని యూ పీ ముఠా ఎత్తుకెళ్లింది. ఢిల్లీ ప్రాంతంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇక్కడి వాహనాలు ఆ రాష్ట్రాలకు..

పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ముఠాలతోపాటు జిల్లాకు చెందిన ముఠాలు బైక్‌ లు, కార్లు, ఆటోలను చోరీలకు పాల్పడుతున్నాయి. ఇక్కడి వాహనాలను కర్ణాటక, మహారాష్ట్రకు తరలించి అక్కడ స్పేర్‌పార్ట్‌లుగా విడగొట్టి విక్రయిస్తున్నా రు. జిల్లాకు చెందిన బైక్‌ దొంగల ముఠాను ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇనుప సామగ్రినీ వదలరు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, నాందెడ్‌ ప్రాంతాలకు చెందిన వారు ఇసుప సామగ్రినీ మాయం చేస్తున్నారు. విద్యుత్‌ నియంత్రికల్లోని కాపర్‌ కాయిల్స్‌ దోచుకెళ్లిన ఘటనలు అనేకం ఉన్నాయి. వాటిని స్క్రాప్‌ కింద మార్చి ముంబై, ఢిల్లీ, గుజరాత్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

రెండు సీవోఈ మైనారిటీ కళాశాలలు

నిజామాబాద్‌ అర్బన్‌: ఉమ్మడి జిల్లాకు మైనారిటీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్‌) ఆధ్వర్యంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ (సీవోఈ) కళాశాలలు రెండు మంజూరయ్యాయి. టెమ్రిస్‌ సెక్రెటరీ షఫియుల్లా ఉత్తర్వులు జారీ చేశారు. నాగారం (బాలుర), ధర్మపురి హిల్స్‌(బాలికల) సీవోఈ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టెమ్రిస్‌ ఉమ్మడి జిల్లా బీఎల్‌సీ బాసిర్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లా మైనారిటీ కేటగిరీకి చెందిన (ముస్లిములు, క్రిస్టియన్లు, పార్సీలు, జైనులు, సిక్కులు) వారితోపాటు నాన్‌ మైనారిటీ కోటా కింద (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ) అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు మైనారిటీ గురుకులాల ప్రిన్సిపాల్‌ సయ్య ద్‌ హైదర్‌ (89857 83112), ఆయేషా (85550 30851), ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి బసీర్‌ (98494 19469)ను సంప్రదించాలని సూచించారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పర్యాటకులతో కళకళలాడుతోంది. వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆనకట్టపై గుర్రపు స్వారీ చేస్తూ ఉల్లాసంగా గడిపారు. ప్రాజెక్టు వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. – బాల్కొండ

ఏటీఎంలలో హర్యానా ముఠాలు..

జిల్లా వాసుల్లో దడ పుట్టిస్తున్న గ్యాంగ్‌లు

ఏటీఎంలు కొల్లగొడుతున్న ముఠాలు

బ్యాంకులను టార్గెట్‌ చేస్తున్న

యూపీ చోరులు

చోరీ వాహనాలు మహారాష్ట్ర, కర్ణాటకకు..

జాతీయ రహదారి వెంట ఉన్న ఏటీఎంలలో దోపిడీ చేయడం హర్యానా ముఠాల ప్రత్యేకత. నాలుగు రోజుల క్రితం నిజామాబాద్‌ నగరంలో ని చంద్రశేఖర్‌కాలనీ చౌరస్తాలో ఏటీఎంలో చోరీ కి యత్నించారు. గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేశారు. పోలీసులు వెంబడించడంతో వాహ నాన్ని వదిలేసి పరారయ్యారు. అదే రోజు ఆర్మూ ర్‌లోని ఏటీఎంను కొల్లగొట్టేందుకు ఇదే ముఠా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం నవీపేట్‌లోని ఏటీఎంలో చోరీకి ఓ గ్యాంగ్‌ ప్రయత్నించింది. ఈ మూడు ప్రాంతాల్లో ఏటీ ఎంలలో చోరీకి యత్నించింది ఒకే ముఠా అని పోలీసులు భావిస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడ్డారు. దుండగులు మహారాష్ట్రలోని లాతూర్‌లో మారుతీ వ్యాన్‌ను చోరీ చేసి అందులోని వచ్చినట్లు గుర్తించారు. పాత నేరస్తుల పనేనని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హల్‌చల్‌1
1/5

హల్‌చల్‌

హల్‌చల్‌2
2/5

హల్‌చల్‌

హల్‌చల్‌3
3/5

హల్‌చల్‌

హల్‌చల్‌4
4/5

హల్‌చల్‌

హల్‌చల్‌5
5/5

హల్‌చల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement