ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని టీచర్స్ కాలనీలోగల నిజాంసాగర్ కెనాల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ మంగళవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 35–45 ఏళ్ల మధ్యలో ఉంటుందని తెలిపారు. నలుపు రంగు టీషర్ట్, సిమెంటు రంగుల నైట్‌ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని ఆర్మూర్ ఏరియా ఆస్పత్రిలోని మార్చురిలో ఉంచినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని శివాపూర్ గ్రామ శివారులో సైకిల్‌ను బైక్ ఢీకొనడంతో ఒకరికి గాయాలైనట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. ఎల్లారెడ్డికి చెందిన గంగారాం శివాపూర్ నుంచి ఎల్లారెడ్డి వైపునకు వస్తుండగా, ఎల్లారెడ్డి వైపు నుంచి శివాపూర్ వైపునకు వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై ఉన్న గంగారాంకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆటో–కారు ఢీకొనడంతో..
ఎల్లారెడ్డి: మండలంలోని కళ్యాణి గ్రామ శివారులో ఆటో–కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. నిజాంసాగర్ నుంచి ఎల్లారెడ్డి వైపునకు వస్తున్న కారు కల్యాణి ప్రాజెక్టు వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నిజాంసాగర్‌కు చెందిన సునీత, అనిత అనే ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని సమీప ఆస్పత్రికి తరలించగా, సునీతకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌కు రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
కారును బస్సు ఢీకొనడంతో..
ఎడపల్లి(బోధన్): మండలంలోని జాన్కంపేట్ దర్గా వద్ద మంగళవారం కారును నిజామాబాద్ నుంచి బోధన్ వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుకాల నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న లారీకి ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న రవి, అతడి భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈమేరకు ఆర్టీసీ డ్రైవర్ రమేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీచందర్‌రెడ్డి తెలిపారు.