మరో పెళ్లి చేసుకుంటున్నాడని.. భర్త ఇంటి ఎదుటే భార్య? | - | Sakshi
Sakshi News home page

మరో పెళ్లి చేసుకుంటున్నాడని.. భర్త ఇంటి ఎదుటే భార్య?

Mar 11 2024 12:20 AM | Updated on Mar 11 2024 4:43 PM

కుటుంబ సభ్యులతో కలిసి భర్త్త ఇంటి ఎదుట బైఠాయించిన శివాని - Sakshi

కుటుంబ సభ్యులతో కలిసి భర్త్త ఇంటి ఎదుట బైఠాయించిన శివాని

మరో పెళ్లి చేసుకుంటున్నాడని ఆవేదన

ఇరు కుటుంబాలకు పోలీసుల కౌన్సిలింగ్‌

నిజామాబాద్‌: అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు తనకు తెలియకుండా మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఓ మహిళ తన భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే కామారెడ్డి పట్టణంలోని భవానీనగర్‌ కాలనీకి చెందిన వడ్ల కార్తీక్‌కు సిరిసిల్లకు చెందిన శివానితో 2019లో వివాహమైంది. పెళ్లిసమయంలో శివానీ కుటుంబ సభ్యులు కార్తీక్‌కు రూ.5లక్షల నగదుతోపాటు 15తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు.

కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాగా, గర్భిణీగా ఉన్న శివానీని కార్తీక్‌ ఆమె తల్లిగారింటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. పాప పుట్టిన తరువాత పెద్ద మనుషుల సమక్షంలో రాజీకుదర్చగా హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. మరో 6 నెలల గడిచిన తరువాత రూ.10 లక్షలు అదనపు కట్నం తేవాలని శివానీని వేధించడం మొదలు పెట్టిన కార్తీక్‌.. శివానీని మళ్లీ తల్లి గారి ఇంటి వద్ద వదిలేసి వెళ్ళిపోయాడు. వారి మధ్య గొడవలు పోలీస్‌స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్లాయి.

ఈ క్రమంలో కార్తీక్‌ మరో పెళ్ళికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసుకున్న శివాని.. తన మూడేళ్ల కుమార్తె, తల్లిదండ్రులు, సోదరునితో కలిసి ఆదివారం కామారెడ్డికి వచ్చింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. తమకు కార్తీక్‌ వచ్చి తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడని శివానీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఇరు కుటుంబాల సభ్యులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు.

ఇవి చదవండి: క్యాబ్‌ డ్రైవర్‌ది హత్యా? ఆత్మహత్యా?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement