భ‌ర్త మ‌రొక‌రితో వివాహం! భార్య తీవ్ర నిర్ణ‌యం.. | - | Sakshi
Sakshi News home page

భ‌ర్త మ‌రొక‌రితో వివాహం! భార్య తీవ్ర నిర్ణ‌యం..

Jan 8 2024 12:48 AM | Updated on Jan 8 2024 8:46 AM

- - Sakshi

నిజామాబాద్‌: తనకు తెలియకుండా మరో వివాహం చేసుకన్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఓ బాధితురాలు ఆందోళన చేపట్టింది. ఆర్మూర్‌ మండలంలోని ఫత్తేపూర్‌కు గంగాధర్‌తో బాల్కొండకు చెందిన కావ్యతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇద్దరి మధ్య గొడవల కారణంగా కావ్య బాల్కొండలో తల్లివద్ద ఉంటోంది. గొడవకు సంబంధించిన కేసు కోర్టులో ఉంది. 15 రోజుల క్రితం గంగాధర్‌ మరో వివాహం చేసుకున్నాడు. దీంతో కావ్య ఫత్తేపూర్‌లో తన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. తనను మోసం చేసిన భర్త గంగాధర్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరారు.

ఇవి చ‌ద‌వండి: సొంత బావతో అక్రమ సంబంధం! భ‌ర్త‌ను దారుణంగా..

Advertisement
 
Advertisement
Advertisement