సొంత బావతో అక్రమ సంబంధం! భ‌ర్త‌ను దారుణంగా.. | - | Sakshi
Sakshi News home page

సొంత బావతో అక్రమ సంబంధం! భ‌ర్త‌ను దారుణంగా..

Jan 8 2024 12:50 AM | Updated on Jan 8 2024 8:35 AM

- - Sakshi

నిజామాబాద్‌: మల్లారం అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో అసలు సూత్రధారి భార్యే అని ఏసీపీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 5న అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసులో విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఇంద్రపురం కాలనీకి చెందిన గురుధాకర్‌ సయాజీ(35)గా గుర్తించినట్లు తెలిపారు.

విచారణలో సయాజీ భార్య అశ్విని సొంత బావ అయిన రామ్‌ జింజోర్‌తో అక్రమ సంబంధం ఉంది. సయాజీ మద్యానికి బానిస కావడంతో భార్యను తరచూ వేధించేవాడు. ఈ నెల 3న సయాజీ భార్యను కొట్టి ఇంటి నుంచి పంపించాడు. దీంతో భర్తను చంపాలని నిర్ణయించుకున్న భార్య.. బావ రామ్‌ జింజోర్‌కు ఫోన్‌ చేసి చెప్పింది. ఈ నెల 5న నిందితుడు సయాజీని మల్లారం అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. సాంకేతిక సహాయంతో నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడి బైక్‌, రెండు సెల్‌ఫోన్లు, చాకును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ వెంకటనారాయణ, ఎస్సై మహేశ్‌ ఉన్నారు.

ఇవి చ‌ద‌వండి: ఆన్‌లైన్‌లో ఫింగర్‌ప్రింట్‌ స్కానర్ బుక్‌.. తెరిచిచూస్తే షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement