'అమ్మా నన్ను క్షమించు.. తరచూ నిన్ను కొట్టే వాడిని..' సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడు.. | - | Sakshi
Sakshi News home page

'అమ్మా నన్ను క్షమించు.. తరచూ నిన్ను కొట్టే వాడిని..' సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడు..

Oct 30 2023 1:04 AM | Updated on Oct 30 2023 2:21 PM

- - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ముప్కాల్‌ మండలం నల్లూర్‌ గ్రామానికి చెందిన సాయికుమార్‌ (23) తాగుడికి బానిసై ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై భాస్కరాచారి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి రాజు బాయి దత్తత కుమారుడు సాయికుమార్‌ తాగుడికి బానిసై అనారోగ్యం పాలయ్యాడు. తరచూ తల్లితో గొడవ పడుతూ కొడుతుండేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తల్లిని కొట్టాడు.

దీంతో ఆమె బంధువుల ఇంటికి వెళ్లింది. తల్లి లేని సమయంలో శనివారం రాత్రి నా చావుకు ఎవరూ కారణం కాదని, అమ్మా నన్ను క్షమించు.. తరచూ నిన్ను కొట్టే వాడిని, మరో జన్మలో నీ కడుపునే పుట్టాలని ఉందని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: భార్యను కడతేర్చి.. ఐదేళ్ల కూతురితో..

Advertisement
 
Advertisement
Advertisement